వీధి కుక్కలను చూడగానే భయంతో పారిపోయిన సింహం..వీడియో ఇదిగో!
- గుజరాత్‌లో వెలుగు చూసిన ఘటన
- వైరల్ వీడియోను షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి
- నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్న వీడియో
గుజరాత్‌లోని గిర్ సోమ్‌నాథ్ జిల్లాలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం.. రాత్రి వేళ ఓ సింహం గ్రామంలోకి ప్రవేశించింది. అక్కడ ఉన్న ఆవుల మందను టార్గెట్ చేసి అటువైపు వెళుతుండగా సీన్‌లోకి వీధి కుక్కలు ఎంట్రీ ఇచ్చాయి. సింహాన్ని గమనించిన వెంటనే ఓ నాలుగైదు శునకాలు దాని వెంటపడ్డాయి. మనకు రిస్క్ ఎందుకని సింహం అనుకుందో ఏమో గానీ శునకాలను చూడగానే అక్కడి నుంచి పారిపోయింది.
ఈ వీడియో నెట్టింట్లో పెద్ద చర్చకే దారి తీసింది. ‘స్థాన బలిమి కాని తన బలిమి కాదు..’ అన్నట్టు ఈ సీన్ ఉందని కొందరు కామెంట్ చేశారు. తమ ఇలాకాను కాపాడుకునేందుకు జంతువులు ఎంతటి రిస్క్ అయినా చేస్తాయని మరికొందరు వ్యాఖ్యానించారు. ఐకమత్యమే మహాబలం అని మరికొందరు చెప్పుకొచ్చారు.