లాభాల బాటలో సెన్సెక్స్.!.
- అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో సూచీలు లాభాల బాట
- సెన్సెక్స్@57,814, నిఫ్టీ@17,040
- అంతర్జాతీయ బ్యాంకింగ్ సంక్షోభ నివారణ చర్యలపై మదుపర్లలో ఆశలు
సోమవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగ సంక్షోభాన్ని నివారించేందుకు జరుగుతున్న ప్రయత్నాలతో మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొంది. ఇక అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ నేడు సమావేశం కానుంది. వడ్డీ రేట్ల పెంపుపై చర్చించనుంది. ఇందుకు సంబంధించి బుధవారం తుది నిర్ణయం వెలువడుతుంది. వడ్డీ రేట్లు పెరిగిన పక్షంలో మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముడిచమురు ధరలు కూడా పుంజుకున్నాయి. ఇటీవల 15 నెలల కనిష్ఠానికి పడిపోయిన సూచీలు సోమవారం క్రమంగా పెరిగాయి. ఇక ఆదానీ ఎంటర్‌ప్రైజెస్, ఇండియన్ ఆయిల్, ఎన్‌టీపీసీ, స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూవబుల్ ఎనర్జీ తదితర కంపెనీల షేర్లను ఈరోజు జాగ్రత్తగా గమనిస్తుండాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.