ఏపీ అసెంబ్లీలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య ఘర్షణ.. సభ వాయిదా!
- జీఓం నెం.1పై సభలో ఉద్రిక్తత
- జీఓను రద్దు చేయాలంటూ టీడీపీ డిమాండ్
- పరస్పరం సవాళ్లు విసురుకున్న ఎమ్మెల్యేలు
- టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ, వైసీపీఎమ్మెల్యే సుధాకర్ బాబు మధ్య వాగ్వాదం
- తమపై దాడి చేశారంటూ ప్రభుత్వ ప్రతిపక్ష ఎమ్మెల్యేల పరస్పర ఆరోపణలు
- తీవ్ర ఉద్రిక్తతల మధ్య సభ వాయిదా
ఈ క్రమంలో వైసీపీ సభ్యులు టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రులు అంబటి రాంబాబు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, డిప్యుటీ సీఎం అంజన్ బాషా, మల్లాది విష్ణు..టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు..టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద తమ నిరసన కొనసాగించారు. ఈ దశలో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలంటూ చీఫ్ విప్ ముదునూరు ప్రసాద రాజు తీర్మానాన్ని ప్రతిపాదించే ప్రయత్నం చేశారు. ఇంతలో స్పీకర్ పోడియం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగింది. టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమపై దాడి చేశారంటూ టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలోనే సభ వాయిదా పడింది. అయితే.. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోను విడుదల చేయాలంటూ టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు.