పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ స్థానంలోనూ టీడీపీ విజయం
- ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్
- పశ్చిమ రాయలసీమ స్థానంలో భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విక్టరీ
- 7,543 ఓట్లతో వైసీపీ అభ్యర్థి రవీంద్రారెడ్డిపై జయభేరి
తొలి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకపోవడంతో, రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించి విజేతను తేల్చారు. నిన్న ఆధిక్యంలో నిలిచిన వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ఇవాళ ఆ ఆధిక్యాన్ని నిలుపుకోలేకపోయారు. రెండో ప్రాధాన్యత ఓట్లు ఆయనకు ప్రతికూలంగా మారాయి.