జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు శాశ్వతంగా సస్పెండ్ చేస్తారు: నిమ్మల రామానాయుడు
- ఇళ్లు లేని పేదలను జగన్ వంచిస్తున్నారన్న నిమ్మల
- ఈ ఏడాది చివరికైనా పేదలకు ఇళ్లను అప్పగించాలని డిమాండ్
- జగన్ ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని వ్యాఖ్య
అసెంబ్లీ సమావేశాల్లో తమకు సమాధానాలు చెప్పలేక మంత్రులు ఇబ్బంది పడుతున్నందుకే స్పీకర్ తమను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నారని విమర్శించారు. ప్రజల గొంతులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు శాశ్వతంగా సస్పెండ్ చేస్తారని అన్నారు. జగన్ ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని... ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.