Nani: దసరా సెన్సార్ పూర్తి.. నిడివి ఎంతంటే..!

 Dasara runtime and censor details
  • హీరోగా నాని, హీరోయిన్ గా కీర్తి సురేశ్
  • శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు
  • ఈ నెల 30న విడుదల కానున్న చిత్రం
ఫ్యామిలీ, యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో నాని తొలిసారి పూర్తిస్థాయి యాక్షన్ పాత్రలో నటిస్తున్న చిత్రం దసరా. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం మార్చి 30న విడుదల కాబోతోంది. ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్లు, పాటలు, టీజర్‌, ట్రైలర్‌లు సినిమాపై అంచనాలు పెంచాయి. ధరణి పాత్రలో నానిని ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామా అని అతని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన కొత్త అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా సెన్సార్‌ పూర్తయింది. సెన్సార్‌ బృందం దసరాకు యూ/ఏ సర్టిఫికేట్‌ జారీ చేసింది. రెండు గంటల ఇరవైతొమ్మిది నిమిషాల నిడివితో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. సింగరేణి బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయణ సంగీతం అందించారు. దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

More Telugu News

Nani
new movie
dasara
censor