అందుకే మా హీరోయిన్ ను ఎక్కువగా చూపించడం లేదు: నాని

Dasara Movie Update
  • నాని హీరోగా రూపొందిన 'దసరా'
  • ఆయన జోడీకట్టిన కీర్తి సురేశ్ 
  • వైలెన్స్ గురించి ప్రస్తావించిన నాని 
  • తన ఫేవరెట్ సాంగ్ ను సినిమాలో చూడాల్సిందేనని వెల్లడి 
  • ఈ నెల 30వ తేదీన విడుదల కానున్న సినిమా
నాని హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'దసరా' సినిమా రెడీ అవుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఈ నెల 30వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో నాని బిజీగా ఉన్నాడు. 

తాజా ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ .. "మా దర్శకుడు శ్రీకాంత్  బొగ్గు గనుల నేపథ్యం నుంచే వచ్చాడు. అందువల్లనే ఈ సినిమాను అంత సహజంగా తీయగలిగాడు. ఈ సినిమాలో హీరో వైలెంట్ గా కనిపిస్తాడు గానీ  .. అతనిలో ఎమోషన్ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. ఎక్కడా ఆడియన్స్ ను ఇబ్బంది పెడుతున్నట్టుగా అనిపించదు" అన్నాడు. 

"ఈ సినిమాకి సంబంధించి కీర్తి సురేశ్ పాత్రను ఎక్కువగా రివీల్ చేయలేదు. అలా అని చెప్పేసి సస్పెన్స్ లో పెట్టాలనే ఉద్దేశం కూడా కాదు. ఆమె పాత్ర ఈ సినిమాకి హార్టు లాంటిది. అందువలన ముందుగానే ఆమె పాత్రను ఎక్కువగా చూపించే ప్రయత్నం చేయలేదు. ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలున్నాయి. ఇంతవరకూ 3 పాటలను రిలీజ్ చేశాము .. మరో పాటను త్వరలో వదలనున్నాము. ఐదో పాటను సినిమాలో చూడవలసిందే .. అదే నా ఫేవరేట్ సాంగ్" అని చెప్పుకొచ్చాడు. 

Advertisement
Nani
Keerthi Suresh
Dasara Movie

More Telugu News