బాలకృష్ణకు కౌంటర్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి
- బాలయ్య పాటను ప్లే చేసిన వైసీపీ కార్యకర్త
- వైసీపీ కార్యకర్తపై ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆగ్రహం
- గోపిరెడ్డికి వార్నింగ్ ఇచ్చిన బాలయ్య
- తనకు వార్నింగ్ ఇవ్వడానికి బాలకృష్ణ ఎవరన్న గోపిరెడ్డి
ఈ వ్యాఖ్యలపై గోపిరెడ్డి స్పందిస్తూ... తనకు వార్నింగ్ ఇవ్వడానికి బాలకృష్ణ ఎవరని ప్రశ్నించారు. బాలయ్య పెద్ద హీరో అయితే అది టీడీపీకి గొప్ప అని... తనకు కాదని అన్నారు. బాలకృష్ణ కూడా ఒక మనిషే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. వాస్తవాలను తెలుసుకుని బాలయ్య మాట్లాడాలని అన్నారు. సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో కూడా నటించడం కుదరదని చెప్పారు.