కేసీఆర్​ ఖేల్​ ఖతం అంటూ.. యువతతో ఫుట్ బాల్ ఆడి గోల్​ కొట్టిన రేవంత్ రెడ్డి.. వీడియో ఇదిగో!

revanth reddy plays football with youth
  • హాత్ సే హాత్ జోడో యాత్రలో రేవంత్ రెడ్డి
  • ప్రస్తుతం నిజామాబాద్ లో ఉన్న యాత్ర
  • గ్రౌండ్ లో ఉత్సాహంగా ఫుట్ బాల్ ఆడిన రేవంత్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హత్ సే హాత్ జోడో యాత్రలో బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన యాత్ర నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది. యాత్ర 29వ రోజు సందర్భంగా రేవంత్ తనలోని ఫుట్ బాల్ క్రీడ నైపుణ్యాన్ని చూపెట్టారు. నిజామాబాద్ అర్బన్ లోని ఫుట్ బాల్ గ్రౌండ్ లో ఆయన పలువురు యువతీ, యువకులతో సరదాగా ఫుట్ బాల్ ఆడారు. యువతతో పోటాపోటీగా పరుగులు పెట్టిన రేవంత్ గోల్ కూడా కొట్టారు. కేజీఎఫ్2 బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జతచేసిన ఈ వీడియోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. కేసీఆర్ ‘ఖేల్’ ఖతం అని క్యాప్షన్ ఇచ్చారు.
Advertisement
Revanth Reddy
TPCC President
football
KCR

More Telugu News