Revanth Reddy: నా మాటలు వక్రీకరించారు: రేవంత్ రెడ్డి

My words were twisted says Revanth Reddy
షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అమ్ముడుపోయారంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామెంట్ చేశారనే వార్తలు దుమారాన్ని రేపాయి. దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ... ఈ వ్యాఖ్యలు తాను చేశానంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. తన మాటలను వక్రీకరించారని తెలిపారు. 

కాంగ్రెస్ లో సీనియర్లు అమ్ముడుపోయారంటూ ఓ పత్రిక తప్పుడు వార్తలు రాసిందని విమర్శించారు. తాను అనని మాటలను అన్నట్టుగా రాశారని దుయ్యబట్టారు. ఈ వార్తలను ఖండిస్తున్నానని చెప్పారు. వార్తలు రాసే విషయంలో మీడియా సంయమనం పాటించాలని అన్నారు. రాజకీయ వివాదాలను సృష్టించి సమస్యను జటిలం చేసే ప్రయత్నాలు చేయవద్దని కోరారు. 
Go Back to Shorts
Revanth Reddy
Congress
KCR
BRS

More Telugu News