పదంలోనే సంగీతం ఉందంటూ.. ఆస్కార్ వేదికపై తెలుగు గొప్పతనాన్ని వివరించిన చంద్రబోస్
- నాటునాటు పాటను వరించిన ఆస్కార్ అవార్డు
- పురస్కారం స్వీకరించిన కీరవాణి, చంద్రబోస్
- తెలుగు పదాల్లోనే సంగీతం ఇమిడి ఉందన్న చంద్రబోస్
‘తెలుగులో 56 అక్షరాలు ఉన్నాయి. ఎన్నో పదాలు, వ్యక్తీకరణలు, మరెన్నో భావాలతో కూడిన గొప్ప సాహిత్య, సంగీత భాష మా తెలుగు. అందుకే తెలుగులో సాధారణ పదం రాసినా అది సంగీతంలా ప్రతిధ్వనిస్తుంది. ఆర్ఆర్ ఆర్ లోని నాటు నాటు పాటను తెలుగు తెలిసిన అభిమానులు ప్రేమించారు. మా భాష తెలియని మీలాంటి పాశ్చాత్య ప్రేక్షకులు కూడా ఇంతగా ప్రేమిస్తున్నారంటే కారణం పాటలో ఉన్న శబ్దం, సంగీతమే. అదే మాకు ఈ అవార్డు తెచ్చిపెట్టింది. ఈ పాటలో నేను రాసిన లైన్లు అన్నీ మా గ్రామంలో నాకు ఎదురైన అనుభవాలే. ఇప్పుడు నేను ఇండియా వెళ్లి ఈ అవార్డును నా భార్య, పిల్లలకు చూపించాలని అనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చారు.