ఎన్నాళ్లో వేచిన శతకం.. మూడేళ్ల తర్వాత టెస్టు సెంచరీ సాధించిన కోహ్లీ
- అద్భుత శతకం సాధించిన విరాట్ కోహ్లీ
- అర్ధ శతకం ముందు ఔటైన కేఎస్ భరత్
- తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యం దిశగా భారత్
తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ (44) తోడుగా ఐదో వికెట్ కు కోహ్లీ 86 పరుగులు జోడించాడు. రెండు భారీ సిక్సర్లతో అర్ధ శతకానికి చేరువైన భరత్ ను లైయన్ వెనక్కుపంపాడు. అయితే, లైయన్ బౌలింగ్ లోనే సింగిల్ తో కోహ్లీ టెస్టుల్లో తన 28వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి తోడైన అక్షర్ పటేల్ దూకుడుగా ఆడుతున్నాడు. కోహ్లీ 127, అక్షర్ 25 పరుగులతో నిలవగా.. భారత్ 152 ఓవర్లలో 447/5 స్కోరుతో ఆడుతోంది.