గిల్ జోరుతో ఆసీస్ కు దీటుగా బదులిస్తున్న భారత్
- 129/1 స్కోరుతో లంచ్ విరామానికి వెళ్లిన ఆతిథ్య జట్టు
- 32 పరుగులకు ఔటైన రోహిత్ శర్మ
- అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న శుభ్ మన్ గిల్
మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ (119 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 65 బ్యాటింగ్) ఆకట్టుకుంటున్నాడు. అద్భుతమైన డిఫెన్స్ కు తోడు నాణ్యమైన షాట్లతో బౌండరీలు రాబట్టాడు. అతనికి చతేశ్వర్ పుజారా (22 బ్యాటింగ్) మంచి సహకారం అందిస్తున్నాడు. ప్రస్తుతం రెండో వికెట్ కు గిల్, పుజారా అజేయంగా 55 పరుగులు జోడించారు. మొత్తంగా మూడో రోజు తొలి సెషన్ లో భారత్ ఒక వికెట్ కోల్పోయి 93 పరుగులు రాబట్టింది.