కోట్లు ఉన్నా ఈ స్కూటర్ ను కొనలేరట! దీని ప్రత్యేకత ఏంటంటే..!
- హోలీ సందర్భంగా ఓలా స్పెషల్ ఎడిషన్
- కేవలం 5 స్కూటర్లు మాత్రమే తయారుచేసిన కంపెనీ
- పోటీలో నెగ్గిన వారికి అందజేయనున్నట్లు వెల్లడి
కోట్లు ఖర్చు పెట్టినా సరే కొనలేనంత.. వందలు, వేల మందితో పోటీపడి నెగ్గినా సరే దక్కించుకోలేనంత ప్రత్యేకత ఈ స్కూటర్ లో ఏముందంటే.. కేవలం ఐదంటే ఐదు స్కూటర్లను మాత్రమే తయారుచేయడం, భవిష్యత్తులో తయారుచేసే అవకాశం లేకపోవడమే దీని స్పెషాలిటీ. హోలీ పండుగ సందర్భంగా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో కంపెనీ స్పెషల్ ఎడిషన్ ను తీసుకొచ్చింది. కేవలం ఐదు స్కూటర్లను మాత్రమే తయారుచేసింది. కంపెనీ ప్రచారంకోసం పండుగ థీమ్ తో పోటీ నిర్వహించి, ఐదుగురు విజేతలను లాటరీ ద్వారా ఎంపిక చేసి ఈ స్కూటర్ ను అందజేయనున్నట్లు తెలిపింది.
పోటీ ఏంటంటే..
ఓలా స్కూటర్ ఎస్ 1 తో హోలీ వేడుకలు జరుపుకున్న ఫొటోలను కంపెనీ సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేయడమే.. అందులో అత్యుత్తమంగా భావించిన వాటిని ఎంపిక చేసి, వారిలో నుంచి లాటరీ ద్వారా ఐదుగురు విజేతలను ఎంపిక చేస్తారు.