Ahmedabad Test: అహ్మదాబాద్ టెస్టు: 4 వికెట్లు కోల్పోయిన ఆసీస్

అహ్మదాబాద్ లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టెస్టు జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా లంచ్ తర్వాత సెషన్ లో మరో రెండు వికెట్లు కోల్పోయింది. షమీ రెండు వికెట్లు తీయగా... ఆసీస్ 170 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకుంది. అశ్విన్ 1, జడేజా 1 వికెట్ పడగొట్టారు. 

ట్రావిస్ హెడ్ 32 పరుగులు చేయగా, మూడో టెస్టు విజయంలో కీలకపాత్ర పోషించిన మార్నస్ లబుషేన్ 3 పరుగులకే వెనుదిరిగాడు. తాత్కాలిక సారథి స్టీవెన్ స్మిత్ 38 పరుగులు చేశాడు. పీటర్ హ్యాండ్స్ కోంబ్ 17 పరుగులు చేసి అవుటయ్యాడు. 

ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ స్కోరు 74 ఓవర్లలో 4 వికెట్లకు 185 పరుగులు కాగా.... ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 75, కామెరాన్ గ్రీన్ 9 పరుగులతో ఆడుతున్నారు.
Ahmedabad Test
Team India
Australia

More Telugu News