Team New Zealand: కీలకమైన చివరి టెస్ట్ ముందు ఇండియాకు రికీ పాంటింగ్ సలహా

  • టెస్ట్ సిరీస్ లో 2-1 లీడ్ లో ఉన్న టీమిండియా
  • మూడో టెస్టులో కేఎల్ రాహుల్ స్థానంలో గిల్ కు స్థానం
  • నిరాశ పరిచిన శుభ్ మన్ గిల్
  • నాలుగో టెస్టులో ఇద్దరినీ ఆడించాలన్న పాంటింగ్
Ricky Ponting suggestions to Team India before 4th test

భారత గడ్డపై జరుగుతున్న నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా 2-1 తేడాతో లీడ్ లో ఉంది. అత్యంత కీలకమైన చివరి టెస్టు ఈ నెల 9న అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరగనుంది. ఈ టెస్టులో భారత్ విజయం సాధిస్తే సిరీస్ ను కైవసం చేసుకోవడంతో పాటు, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో కూడా అడుగుపెడుతుంది. దీంతో, ఎలాగైనా మ్యాచ్ ను గెలవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. మరోవైపు, మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని ఆసీస్ భావిస్తోంది. 

ఇదిలావుంచితే, ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న కేఎల్ రాహుల్ ను మూడో టెస్టు నుంచి తప్పించి ఆయన స్థానంలో శుభ్ మన్ గిల్ కు స్థానం కల్పించిన విషయం తెలిసిందే. అయితే గిల్ తీవ్రంగా నిరాశపరిచాడు. రెండు ఇన్నింగ్స్ లలో కేవలం 21, 5 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ టీమిండియాకు కీలక సూచన చేశాడు. ఒకరిని ఆడించి, మరొకరిని పక్కన పెట్టడం కాకుండా... ఇద్దరినీ ఆడించాలని చెప్పాడు. గిల్ తో ఇన్నింగ్స్ ను ఆరంభించి, కేఎల్ రాహుల్ ను మిడిలార్డర్ లో ఆడించాలని సూచించాడు. గతంలో ఇంగ్లండ్ లో ఇలాంటి పరిస్థితుల్లో కేఎల్ రాహుల్ ఆడాడనే విషయాన్ని గుర్తు చేశాడు. ఇంగ్లండ్ కండిషన్లకు అలవాటు పడిన వారిని జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని చెప్పాడు.

More Telugu News