టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు!

  • ఇన్‌స్టాగ్రామ్‌లో పాండ్యాకు 25 మిలియన్ల మంది ఫాలోవర్లు
  • ఆ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడైన క్రికెటర్‌గా రికార్డు
  • అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకున్న స్టార్ క్రికెటర్
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న పాండ్యా.. ప్రపంచంలో ఆ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడైన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. టెన్నిస్ దిగ్గజాలు రఫెల్ నాదల్, ఫెదరర్, డచ్ రేసింగ్ డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ తదితరుల కంటే ఎక్కువమంది ఫాలోవర్లను సంపాదించుకున్న హార్దిక్ ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 

ఈ సందర్భంగా హార్దిక్ తన అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ పోస్టు పెట్టాడు. తన అభిమానుల్లో ప్రతి ఒక్కరూ తనకు ప్రత్యేకమేనన్న హార్దిక్.. తనపై ఇంతటి ప్రేమను చూపిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నాడు. ఇన్నేళ్లుగా తనకు ప్రేమను అందించి, మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నాడు. కాగా, హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న మరోమారు పెళ్లాడి వార్తల్లోకి ఎక్కాడు.

Hardik Pandya
Instagram
Insta Followers
Team India

More Telugu News