చెమ్కీల అంగీలేసి .. 'దసరా' సాంగ్ ప్రోమో రిలీజ్!
- నాని తాజా చిత్రంగా రూపొందిన 'దసరా'
- ఆయనతో రెండోసారి జోడీకట్టిన కీర్తి సురేశ్
- సంగీతాన్ని అందించిన సంతోష్ నారాయణ్
- ఈ నెల 30వ తేదీన ఐదు భాషాల్లో రిలీజ్ అవుతున్న సినిమా
తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లోను ఈ సినిమాను ఈ నెల 30వ తేదీన రిలీజ్ చేయనున్నారు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఈ ఐదు భాషల్లోను సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. 'చెమ్కీల అంగీలేసి ఓ వదినా చాకులెక్క ఉండేటోడే' అంటూ ఈ పాట సాగుతోంది.
జానపద బాణీలో ఈ పాట నడుస్తోంది. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. పూర్తి పాటను ఈ నెల 8వ తేదీన విడుదల చేయనున్నారు. బొగ్గు గనుల నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ స్థాయి మాస్ లుక్ తో నాని కనిపించడం ఇదే మొదటిసారి. ఈ సినిమాపై అంచనాలైతే ఒక రేంజ్ లోనే ఉన్నాయి.