ఆర్సీబీ బౌలింగ్ ను ఉతికారేసిన ఢిల్లీ క్యాపిటల్స్ అమ్మాయిలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆర్సీబీ బౌలింగ్ ను ఉతికారేసిన ఢిల్లీ క్యాపిటల్స్ అమ్మాయిలు

Delhi Capitals smashes RCB bowling
  • డబ్ల్యూపీఎల్ లో నేడు ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ
  • టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్
  • బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించిన షెఫాలీ, లానింగ్
  • భారీ షాట్లతో విరుచుకుపడిన కాప్, జెమీమా
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముంబయిలోని బ్రాబోర్న్ స్టేడియం ఆతిథ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. 

అయితే ఢిల్లీ క్యాపిటల్స్ టాపార్డర్ బ్యాటర్లు ఆర్సీబీ బౌలింగ్ ను చీల్చిచెండాడారు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ జట్టు 2 వికెట్లకు 223 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ముఖ్యంగా, ఓపెనర్లు షెఫాలీ వర్మ, కెప్టెన్ మెగ్ లానింగ్ తొలి వికెట్ కు 162 పరుగులు జోడించి పటిష్ట పునాది వేశారు. 

షెఫాలీ 45 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేయగా... లానింగ్ 43 బంతుల్లో 14 ఫోర్లతో 72 పరుగులు చేసింది. వీరిద్దరి విజృంభణతో ఆర్సీబీ బౌలర్లు నిస్సహాయులయ్యారు. ఎలా బౌలింగ్ చేసినా ఉతికారేయడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అయితే లానింగ్, షెఫాలీ వర్మలను హీదర్ నైట్ ఒకే ఓవర్లో అవుట్ చేసింది. 

కానీ ఆ తర్వాత వచ్చిన మరిజానే కాప్, జెమీమా రోడ్రిగ్స్ కూడా భారీ షాట్లతో విరుచుకుపడడంతో ఆర్సీబీ కష్టాలు కొనసాగాయి. కాప్ 17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 39 పరుగులు చేయగా... జెమీమా 15 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసింది.
Advertisement
Delhi Capitals
RCB
WPL

More Telugu News