దగ్గు మందుతో ఉజ్బెకిస్థాన్లో చిన్నారుల మరణాలు.. నోయిడా ఫార్మా కంపెనీ అధికారుల అరెస్ట్
- ముగ్గురిని అదుపులోకి తీసుకున్న యూపీ పోలీసులు
- పరారీలో ఇద్దరు డైరెక్టర్లు
- సదరు ఫార్మా దగ్గు మందు వాడి డిసెంబర్ లో 18 మంది చిన్నారుల మృతి
ఈ నేపథ్యంలో దగ్గు మందు తయారీ కేంద్రాన్ని అధికారులు పరిశీలించి ప్లాంట్‌లోని డాక్-1 మ్యాక్స్ దగ్గు మందు నమూనాలను సేకరించారు. కాలుష్య పరీక్షల కోసం నమూనాలను చండీగఢ్‌లోని రీజనల్ డ్రగ్స్ టెస్టింగ్ లాబొరేటరీకి పంపారు. సిడిఎస్‌సిఓ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదు మేరకు మారియన్ బయోటెక్‌కు చెందిన ఇద్దరు డైరెక్టర్లు సహా ఐదుగురు అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. కంపెనీ డైరెక్టర్లు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.