వలస కార్మికులు భయపడాల్సిన అవసరం లేదు: స్టాలిన్

  • బీహార్ నుంచి వచ్చిన కార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ ప్రచారం
  • ఎవరికి సమస్య వచ్చినా హెల్ప్ లైన్ కి ఫోన్ చేయాలన్న స్టాలిన్
  • వలసదారులకు అండగా ఉంటామని భరోసా
తమిళనాడులో ఉంటున్న ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి స్టాలిన్ భరోసా ఇచ్చారు. వలస కార్మికులకు ప్రభుత్వం రక్షణగా ఉంటుందని చెప్పారు. మీలో ఎవరినైనా ఎవరైనా బెదిరించినా, హింసించినా హెల్ప్ లైన్ కి ఫోన్ చేయాలని సూచించారు. వలసదారులకు తమిళనాడు ప్రభుత్వం, ప్రజలు అండగా ఉంటారని చెప్పారు. 

బీహార్ నుంచి తమిళనాడుకు వచ్చిన వలసదారులపై దాడులు జరుగుతున్నాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్టాలిన్ ఈ మేరకు భరోసాను కల్పించారు. బీహార్ అసెంబ్లీలో కూడా ఈ అంశంపై వాడీవేడి చర్చ జరిగింది. 


Stalin
Tamil Nadu
Migrants

More Telugu News