పర్యాటకరంగంలో ఈ స్థాయిలో పెట్టుబడులు ఎప్పుడూ రాలేదు: రోజా
- జగన్ అంటే ఒక బ్రాండ్ అన్న రోజా
- రాష్ట్రానికి రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న మంత్రి
- ప్రతి ఒప్పందాన్ని క్షేత్ర స్థాయి వరకు తీసుకెళ్తామని వ్యాఖ్య
తిరుపతిని టెంపుల్ టూరిజంగా, విశాఖను ప్రకృతి టూరిజంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని రోజా అన్నారు. విశాఖ, తిరుపతి, గండికోట, పిచ్చుకలంకలో ఒబెరాయ్ సంస్థ కొత్త హోటల్స్ ఏర్పాటు చేయనుందని చెప్పారు. ఢిల్లీవాడు వెక్కిరించినా, మద్రాస్ వాడు వెళ్లగొట్టినా, హైదరాబాద్ వాడు గెంటేసినా... తమ కాళ్లమీద తాము నిలబడుతున్నామని అన్నారు. ఇతర రాష్ట్రాల రాజధానులకు దీటుగా వైజాగ్ ను తీర్చిదిద్దుతామని చెప్పారు.