ఆ ఉద్యోగులు పాత పెన్షన్ పథకం ఎంచుకోవచ్చు: కేంద్రం
- పాత పెన్షన్ విధానంపై కేంద్రం కీలక ప్రకటన
- 2003 డిసెంబర్ 22కు ముందు విడుదలైన నోటిఫికేషన్ల ద్వారా జాబ్‌లో చేరిన వారికి ఓపీఎస్ వర్తింపు
- వన్ టైం ఆప్షన్ కింది ఓపీఎస్‌ను ఎంచుకునేందుకు అనుమతి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రభుత్వం 2003 డిసెంబర్ 22న నేషనల్ పెన్షన్ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఉద్యోగ వర్గాల నుంచి అందిన అభ్యర్థనలను పరిశీలించిన మీదట అప్పటి వారికి పాత పింఛను అవకాశాన్ని కల్పిస్తూ కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది.