అమ్మాయిలను వద్దన్నారని.. అబ్బాయిలతోనే లోదుస్తుల యాడ్స్!
- లోదుస్తుల ప్రకటనల్లో అమ్మాయిలు కనిపించకుండా చైనా నిషేధం
- ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చిన చైనా
- అబ్బాయిలతోనే లింగేరి మోడలింగ్
- వెల్లువెత్తుతున్న కామెంట్లు
అమ్మాయిల స్థానంలో అబ్బాయిలతో లోదుస్తులకు సంబంధించిన యాడ్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈ వీడియోలపై ప్రపంచవ్యాప్తంగా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. షేక్స్పియర్ కాలంలోనూ ఇలాగే ఉండేదని, అప్పట్లో వాణిజ్య ప్రకటనల్లో నటించేందుకు మహిళలకు అనుమతి లేదని కొందరంటే.. అప్పట్లో స్త్రీ పాత్రలను పురుషులు ధరించేవారని మరో యూజర్ రాసుకొచ్చాడు.