ఫాక్స్ కాన్ తో తెలంగాణ సర్కారు ఒప్పందం వేళ ఆసక్తికర సంఘటన
- సీఎం కేసీఆర్ తో ఫాక్స్ కాన్ బృందం భేటీ
- నేడు ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ ల్యూ పుట్టినరోజు
- స్వదస్తూరీతో రూపొందించిన గ్రీటింగ్ కార్డు ఇచ్చిన సీఎం కేసీఆర్
ఈ సందర్భంగా ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఇవాళ యంగ్ ల్యూ పుట్టినరోజు అని తెలుసుకున్న సీఎం కేసీఆర్ తన సొంత చేతిరాతతో రూపొందించిన గ్రీటింగ్ కార్డును ఆయనకు అందజేశారు. ఆయనకు ఓ వీణ బొమ్మను కూడా బహూకరించారు. ఆ తైవాన్ వ్యాపార దిగ్గజానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రగతి భవన్ లో యంగ్ ల్యూ, ఆయన ప్రతినిధి బృందానికి తెలంగాణ వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు.
