స్టాలిన్ దేశ ప్రధాని ఎందుకు కాకూడదు?: ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
- దేశ ఐక్యతను కాపాడేందుకు స్టాలిన్ కృషి చేస్తున్నారన్న ఫరూక్
- కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు పాటుపడుతున్నారని కితాబు
- భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వమని వ్యాఖ్య
స్టాలిన్ 70వ పుట్టినరోజు సందర్భంగా ఫరూక్ అబ్దుల్లా చెన్నైకి వచ్చి, ఆయన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వమని... దాని కోసం స్టాలిన్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు.