మరో సంచలనానికి రెడీ అవుతున్న 'బిచ్చగాడు 2' .. రిలీజ్ డేట్ ఇదే!
- విజయ్ ఆంటోని నుంచి 'బిచ్చగాడు 2'
- కథానాయికగా అలరించనున్న కావ్య థాపర్
- కీలకమైన పాత్రలో రితిక సింగ్
- ఏప్రిల్ 14వ తేదీన సినిమా రిలీజ్
ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అనే కుతూహలాన్ని తెలుగు ప్రేక్షకులు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను కొంతసేపటి క్రితం ప్రకటించారు. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయన్నున్నట్టు చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు.
విజయ్ ఆంటోని దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా కావ్య థాపర్ అలరించనుంది. ఇతర ముఖ్యమైన పాత్రలలో రితిక సింగ్ .. రాధా రవి .. మన్సూర్ అలీఖాన్ కనిపించనున్నారు. ఫస్టు పార్టు మాదిరిగానే సెకండ్ పార్టు సంచలనానికి తెరతీస్తుందేమో చూడాలి.