తొలి బంతికి బ్యాట్ విరిగి.. రెండో బంతికి వికెట్లు ఎగిరిపడి.. బౌలింగ్ అంటే ఇదే!
- పాక్ పేసర్ షాహీన్ షా అఫ్రిది సంచలన బౌలింగ్
- పీఎస్ ఎల్ లో పెషావర్ జాల్మీ మ్యాచ్ లో ఐదు వికెట్లు పడగొట్టిన షాహీన్
- గాయం తర్వాత పునరాగమనంలో అదరగొడుతున్న పాక్ పేసర్
ఐదు వికెట్లు పడగొట్టే క్రమంలో ప్రత్యర్థి బ్యాటర్లను షాహీన్ తన పేస్ తో హడలెత్తించాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పెషావర్‌ను షాహీన్ అఫ్రిదీ ఆరంభంలోనే హడలెత్తించాడు. షాహీన్ సంధించిన ఇన్నింగ్స్ తొలి బంతికి.. మహ్మద్ హారీస్ బ్యాట్ విరిగి రెండు ముక్కలైంది. రెండో బంతికే హారీస్‌ను షాహీన్ క్లీన్ బౌల్డ్ చేయగా.. అతని వేగానికి వికెట్లు ఎగిరి పడ్డాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాగా, మోకాలి గాయం కారణంగా చాలా కాలంపాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న షాహీన్ ఈ లీగ్ తోనే రీఎంట్రీ ఇచ్చాడు. తన పేస్ తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నాడు.