విద్యార్థులకు నూతన వీసా విధానాన్ని తీసుకువచ్చిన అమెరికా

USA brings new visa system for students
  • విద్యార్థులకు ఉపయోగకరంగా నూతన వీసా విధానం
  • కోర్సు ప్రారంభానికి ఏడాది ముందే వీసాకు దరఖాస్తు
  • గతంలో ఈ పరిమితి 120 రోజులు 
  • వేసవిలో మరిన్ని విద్యార్థి వీసా స్లాట్లు కేటాయిస్తామన్న అమెరికా ఎంబసీ
అగ్రరాజ్యం అమెరికా ప్రపంచంలో ఎంతోమంది విద్యార్థులకు గమ్యస్థానం. ఇప్పుడు విద్యార్థులకు లాభించేలా అమెరికా ప్రభుత్వం కొత్త వీసా విధానం తీసుకువచ్చింది. అమెరికాలో కోర్సు ప్రారంభానికి ఏడాది ముందే స్టూడెంట్ వీసాకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. గతంలో కోర్సు ప్రారంభానికి 120 రోజుల ముందు మాత్రమే వీసాకు దరఖాస్తు చేసుకునే వీలుండేది. ఈ పరిమితిని తాజాగా ఏడాదికి పెంచారు. 

వేసవిలో అధికంగా విద్యార్థి వీసా స్లాట్లు కేటాయిస్తామని భారత్ లోని అమెరికా దౌత్య కార్యాలయం వెల్లడించింది. అమెరికాలో నూతన వీసా విధానం గత 26 నుంచి అమల్లోకి వచ్చింది.
Go Back to Shorts
USA
Students
Visa
Course
Application

More Telugu News