Neutral Citation: ఇకపై సుప్రీంకోర్టు వెలువరించే ప్రతి తీర్పుకు ప్రత్యేక నెంబరు కేటాయింపు

  • ఇకపై సుప్రీంకోర్టులోనూ న్యూట్రల్ సైటేషన్ విధానం
  • ప్రతి తీర్పుకు, వాదనలకు ప్రత్యేక నెంబరు కేటాయింపు
  • ఇప్పటికే ఢిల్లీ, కేరళ హైకోర్టుల్లో న్యూట్రల్ సైటేషన్ విధానం
Neutral Citation System to be implement in Supreme Court

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వెలువరించే తీర్పులకు న్యూట్రల్ సైటేషన్ విధానం అమలు చేయనున్నారు. ఇకపై సుప్రీంకోర్టు వెలువరించే ప్రతి తీర్పునకు ఒక ప్రత్యేక నెంబరు కేటాయిస్తారు. ఈ నెంబరు శాశ్వతంగా ఉంటుంది. ఈ నెంబరు ద్వారా ఏదైనా కేసు తీర్పులను, వాదనల రికార్డులను వెదకడం, గుర్తించడం సులువు అవుతుంది. న్యూట్రల్ సైటేషన్స్ విధానం దేశంలో ఇప్పటికే కేరళ, ఢిల్లీ హైకోర్టుల్లో అమలులో ఉంది. 

దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పందిస్తూ... దాదాపుగా 30 వేల తీర్పులకు సైటేషన్స్ ఉంటాయని వివరించారు. ఈ విధానంతో ఏదైనా కేసు విషయంలో ఎలాంటి గందరగోళం ఉండదని అన్నారు.

More Telugu News