సినీ పరిశ్రమలో ‘బంధు ప్రీతి’పై స్పందించిన నాని
- బంధు ప్రీతిని ప్రోత్సహించేది అభిమానులేనన్న నాని
- తమ ఆరాధ్య నటుల వారసులను పెద్ద తెరపై చూడాలన్నది వారి కోరికగా వెల్లడి
- తనను రామ్ చరణ్ తో పోల్చుకున్న నటుడు
సినీ పరిశ్రమ నుంచే వచ్చిన వ్యక్తికి, బయటి వ్యక్తికి మధ్య వ్యత్యాసం గురించి కూడా నాని క్లుప్తంగా, స్పష్టంగా చెప్పాడు. రామ్ చరణ్ తేజ్ తో తనను పోల్చుకున్నాడు. ‘‘నా మొదటి సినిమాను లక్ష మంది ప్రజలు చూశారు. కానీ, రామ్ చరణ్ మొదటి సినిమాను కోటి మంది వీక్షించారు. బంధు ప్రీతిని ప్రోత్సహించేది అభిమానులే. ప్రజలు ఎప్పుడూ కూడా తాము ఆరాధించే వారి కుమారులు, కుమార్తెలను బిగ్ స్క్రీన్ పై చూడాలని కోరుకుంటారు’’ అని నాని చెప్పాడు.
ప్రోమో వీడియోలో రానా సైతం బంధు ప్రీతి అంశంపై మాట్లాడుతూ.. ‘‘మీ తల్లిదండ్రులు సాధించిన విజయాలు, వారసత్వాన్ని మీరు కొనసాగించలేకపోతే, మీ కుటుంబానికి అపచారం చేసినట్టే’’ అని పేర్కొనడం గమనించొచ్చు.