చెన్నై లోకల్ ట్రైన్ లో గొడవ.. కత్తులతో దాడి చేసుకున్న విద్యార్థులు
- ఆరుగురు స్టూడెంట్లకు తీవ్ర గాయాలు
- చైన్ లాగి రైలు ఆపేసి మరీ బీభత్సం
- ప్రయాణికుల్లో భయాందోళనలు
క్రమంగా వాదన పెరిగి పరస్పరం తిట్టుకున్నారు. ఆపై కోపం పట్టలేక ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. చైన్ లాగి ట్రైన్ ను ఆపేసి మరీ గొడవపడ్డారు. కొంతమంది కత్తులు, కంకర రాళ్ళతో దాడి చేయడంతో ఆరుగురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ గొడవతో ట్రైన్ లోని మిగతా ప్రయాణికులు భయాందోళనలకు లోనయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులను చూసి మిగతా విద్యార్థులు పారిపోయారు. గాయపడిన విద్యార్థులను పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ గొడవపై కేసు నమోదు చేసుకుని విచారణ మొదలు పెట్టారు.