‘పులి - మేక’ నుంచి ఇంట్రెస్టింగ్ ట్రైలర్!
- జీ 5 వెబ్ సిరీస్ గా 'పులి - మేక'
- క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
- ప్రధానమైన పాత్రలో లావణ్య త్రిపాఠి
- కీలకమైన పాత్రలో కనిపించనున్న సుమన్
- ఈ నెల 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్
ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఓటీటీల్లో ఒకటైన జీ 5 ఓటీటీ లైబ్రరీలో, ఫిబ్రవరి 24న మరో బెస్ట్ ఒరిజినల్‌గా జాయిన్ కావటానికి 'పులి - మేక' సిద్ధమవుతోంది. కొంతసేపటి క్రితం ట్రైలర్‌ను డైరెక్టర్ బాబీ, హీరో సిద్ధు జొన్నలగడ్డ రిలీజ్ చేశారు. ‘‘చావు చెప్పిరాదు .. వచ్చినప్పుడు తప్పించుకోవడం సాధ్యం కాదు' అంటూ ట్రైలర్ మొదలవుతోంది.
పోలీస్ డిపార్ట్ మెంటును టార్గెట్ చేసిన సీరియల్ కిల్లర్ వాళ్లను వరుసగా హత్య చేస్తూ వెళుతుంటాడు. ఈ కేసును డీల్ చేయడం కోసం అపాయింట్ అవుతుంది ఐపీయస్ ఆఫీసర్ కిరణ్ ప్రభ. తనకంటూ ఓ టీమ్‌ని సెలక్ట్ చేసుకుని ఈ కేసును ఆమె డీల్ చేయడం మొదలుపెడుతుంది. కిరణ్ ప్రభ అండ్ టీమ్ చేసే ప్రయత్నం ఫలిస్తుందా? అనేదే కథ. లావణ్య త్రిపాఠి .. ఆది సాయి కుమార్ .. సుమన్ .. సిరి .. ముక్కు అవినాశ్ ప్రధాన పాత్రల్లో నటించారు.