నేను గొడ్డుమాంసం తింటాను.. ఇది మా ఆహారపు అలవాటు: బీజేపీ మేఘాలయ చీఫ్
- మేఘాలయతో ప్రతి ఒక్కరూ గొడ్డు మాంసం తింటారన్న మావ్రీ
- తమ ఆహార అలవాటు సంస్కృతిలో భాగమని స్పష్టీకరణ
- బీజేపీలో ప్రతి ఒక్కరూ తమకు కావాల్సింది తినే స్వేచ్ఛ వుందని వ్యాఖ్య
బీజేపీలో ప్రతి ఒక్కరూ తమకు కావాల్సింది తినే స్వేచ్ఛ కలిగి ఉన్నారని మావ్రీ అన్నారు. ఇది ఆహార అలవాటు అని, దీంతో ఓ రాజకీయ పార్టీకి ఎందుకు ఇబ్బంది ఉండాలి? అని ప్రశ్నించారు. మేఘాలయలో ప్రతి ఒక్కరూ గొడ్డు మాంసం తింటారని, రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు, నియంత్రణల్లేవని స్పష్టం చేశారు.
‘‘ఇది మా అలవాటు, మా సంస్కృతి’’ అని మావ్రీ అన్నారు. గోవధ అంశంపై మాట్లాడుతూ.. తమ సొంత ఆహార అలవాట్లనే అనుసరిస్తామని, దీనిపై ఎలాంటి నిషేధం లేదని, ఈ దిశగా తమకు ఎలాంటి ఆదేశాల్లేవని పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కనీసం 34 స్థానాలు గెలుచుకుంటామన్నారు.