తారకరత్న భార్య అలేఖ్యను పరామర్శించిన షర్మిల... వీడియో ఇదిగో!

Sharmila visits Tarakaratna house
  • మోకిల గ్రామంలో తారకరత్న భౌతికకాయం
  • నివాళులు అర్పించిన షర్మిల
  • అలేఖ్యను ఓదార్చిన వైనం
గుండెపోటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందిన నందమూరి తారకరత్న భౌతికకాయానికి వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులు అర్పించారు. షర్మిల ఈ సాయంత్రం రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలో ఉన్న తారకరత్న నివాసానికి వచ్చారు. తీవ్ర విషాదంలో ఉన్న తారకరత్న భార్య అలేఖ్యను ఓదార్చారు. అలేఖ్యతో మాట్లాడి ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. 

ఈ సందర్భంగా అక్కడే ఉన్న వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డితోనూ, అలేఖ్య కుటుంబ సభ్యులతోనూ షర్మిల మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది.
Go Back to Shorts
YS Sharmila
Tarakaratna
Demise
Alekhya

More Telugu News