జోగి నాయుడికి పదవిపై.. బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్!
- జగన్ ను నమ్ముకున్నందుకు జోగి నాయుడుకీ పదవి ఇచ్చారన్న బండ్ల గణేశ్
- ఆల్ ది బెస్ట్ తమ్ముడు అంటూ ట్వీట్
- సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్న నెటిజన్లు
ఈ విషయంపై కమెడియన్ కమ్ నిర్మాత బండ్ల గణేశ్ స్పందించారు. ‘‘జగన్ గారిని నమ్ముకున్నందుకు జోగి నాయుడుకి కూడా పదవి. ఆల్ ది బెస్ట్ తమ్ముడు’’ అంటూ ట్వీట్ వేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ ట్వీట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరైతే బండ్ల గణేశ్ ను ఏకిపారేస్తున్నారు. ‘త్రివిక్రమ్ వీడిని ఎందుకు రానివ్వలేదో ఇప్పుడు అర్థం అయింది’ అని ఒకరు.. ‘కళ్యాణ్ గారు కొందరిని దూరంగా ఉంచడమే మంచింది... ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మారుస్తున్నారు’ అని మరొకరు కామెంట్ చేశారు.