అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం?

taraka ratna in crttical condition
  • తారకరత్న కోసం రంగంలోకి విదేశీ వ్యైద్యుల బృందం 
  • కొనసాగుతున్న అత్యవసర చికిత్స
  • ఆసుపత్రికి చేరుకున్న బాలక‌ృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు!
నందమూరి తారకరత్న పరిస్థితి అత్యంత విషమంగా మారినట్లుగా తెలుస్తోంది. మూడు వారాలుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స అందిస్తుండగా.. ఈ రోజు ఆయన ఆరోగ్యం మరింత దిగజారినట్లు సమాచారం. ఎంఆర్ఐ స్కాన్‌లో ఈ విషయం బయటపడినట్లు తెలుస్తోంది. తారకరత్న కోసం విదేశీ వైద్యులు రంగంలోకి దిగినట్లు తెలిసింది. అత్యవసర చికిత్స కొనసాగుతోందని సమాచారం.

మరోవైపు తారకరత్న పరిస్థితి బాగా లేదని తెలుసుకుని నందమూరి బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్‌కు చేరుకున్నట్టుగా సమాచారం అందుతోంది. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ ను విడుదల చేసే అవకాశం ఉంది.
Advertisement
taraka ratna
crttical condition

More Telugu News