వివో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వి27
- వివో సిరీస్ లో రెండు ఫోన్లను తీసుకొస్తున్న కంపెనీ
- పూర్తి వివరాలను వెల్లడించని కంపెనీ
- ఫీచర్లకు సంబంధించి కొన్ని అంశాలు మాత్రమే వెల్లడి
ట్రిపుల్ కెమెరా సెటప్ తో వివో వీ27 స్మార్ట్ ఫోన్ ను తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇక పంచ్ హోల్ డిజైన్‌తో ముందు భాగంలో కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించనున్నారు. కెమెరా విషయంలో కాంప్రమైజ్ లేకుండా హై క్వాలిటీతో తీసుకురానున్నట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ కొత్త మోడల్ ధర విషయానికి వస్తే రూ.42 వేల దాకా ఉండొచ్చని నిపుణుల అంచనా. లాంచింగ్ ఆఫర్ కింద రూ.40 వేల లోపు ధరకే ఈ 5జి ఫోన్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అనధికారిక సమాచారం.