కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

Chandrababu wishes CM KCR on his birthday
  • నేడు సీఎం కేసీఆర్ పుట్టినరోజు
  • వేడుకలు జరుపుతున్న బీఆర్ఎస్ శ్రేణులు
  • కేసీఆర్ పై శుభాకాంక్షల వెల్లువ
  • కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన మోదీ, తమిళిసై
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయనపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా కేసీఆర్ కు విషెస్ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. కేసీఆర్ కు దీర్ఘాయుష్షు కలగాలని, మంచి ఆరోగ్యం లభించేలా దేవుడి దీవెనలు అందాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. 

అటు, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
Advertisement
Chandrababu
KCR
Birthday
Telangana
TDP
BRS
Andhra Pradesh

More Telugu News