చైనాకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు: అమెరికా అధ్యక్షుడు
- బెలూన్ కూల్చివేతపై స్పందించిన జో బైడెన్
- చైనాకు క్షమాపణ చెప్పేది లేదని ప్రకటన
- త్వరలో చైనా అధ్యక్షుడితో మాట్లాడే అవకాశం ఉందని వెల్లడి
‘‘త్వరలో అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో నేను మాట్లాడొచ్చు. మేం ప్రచ్ఛన్న యుద్ధం కోరుకోవట్లేదు. అయితే..బెలూన్ కూల్చివేత ఘటనపై క్షమాపణలు చెప్పే ఉద్దేశమే నాకు లేదు. అమెరికా ప్రజల భద్రత, ప్రయోజనాలకే మా తొలి ప్రాధాన్యం’’ అని జో బైడెన్ స్పష్టం చేశారు. కాగా.. ఇప్పటివరకూ అమెరికా తన గగనతలంలో మొత్తం నాలుగు గుర్తుతెలియని వస్తువులను కూల్చేసింది. వాటిలో ఒకటి చైనా బెలూన్ కాగా.. మిగతా మూడింటి విషయంలో అమెరికా సైన్యం పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.