12 రోజులపాటు రోజూ బాదం.. మధుమేహానికి దూరం!
- చెన్నైలోని మద్రాసు మధుమేహ పరిశోధన సంస్థ నేతృత్వంలో పరిశోధన
- 26-65 ఏళ్ల మధ్య వయసున్న 400 మందిపై పరిశోధనలు
- క్లోమ గ్రంధి పనితీరును మెరుగుపరచనున్న బాదం
- బీఎంఐ ఇండెక్స్‌లోనూ తగ్గుదల
తాజాగా చెన్నైలోని మద్రాసు మధుమేహ పరిశోధన సంస్థకు చెందిన పరిశోధకుల నేతృత్వంలో 26-65 ఏళ్ల మధ్య వయసున్న 400 మందిపై జరిగిన అధ్యయనంలో మరో కొత్త విషయం వెల్లడైంది. వరుసగా 12 రోజులపాటు క్రమం తప్పకుండా బాదంలను తింటే క్లోమం పనితీరు మెరుగుపడుతుందని తేలింది. ఫలితంగా ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. రక్తంలో చక్కెర నిల్వల నియంత్రణ మెరుగవుతుంది. అలాగే బీఎంఐ ఇండెక్స్‌లోనూ తగ్గుదల కనిపిస్తుంది. అలాగే ఊబకాయంతో బాధపడుతున్న వారిలో డయాబెటిస్ ముప్పు తగ్గుతుందని ఈ పరిశోధనలో తేలింది.