Revanth Reddy: అప్పటికప్పుడు కొరమేను చేపలు పట్టుకొచ్చి రేవంత్ రెడ్డి కోసం వండిన ముదిరాజ్ యువకుడు

Mudiraj youth prepares Murrel fish curry for Revanth Reddy
షార్ట్స్‌లో చూడండి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఓ కుటుంబం రేవంత్ రెడ్డి కోసం ప్రత్యేకంగా కొరమేను చేపలతో కూర వండి భోజనం పంపించింది. చేపలకూరను వారే స్వయంగా ఆయనకు అందజేశారు. ముదిరాజ్ ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. 

పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డి... కిరణ్ ముదిరాజ్ అనే యువకుడి ఇంటికి వచ్చారు. రేవంత్ రాక నేపథ్యంలో కిరణ్ చెరువులోంచి కొరమేను చేపలను పట్టుకొచ్చారు. ఆ తాజా చేపలతో రుచికరమైన పులుసుతో పాటు, ఫ్రై చేసి రేవంత్ కు పసందైన భోజనం అందించారు. 

దీనిపై రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. ఈ ప్రేమ ముందు ఏ కష్టమైనా బలాదూర్ అని పేర్కొన్నారు. పేదవాడు చూపే ప్రేమే నా పోరాటానికి ఆలంబన అని వెల్లడించారు. ముదిరాజ్ సోదరుడు అభిమానంతో వండి తెచ్చిన భోజనం ఈ యాత్రలో తనకు ఒక మధుర జ్ఞాపకంలా మిగిలిపోతుందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో పంచుకున్నారు.
Go Back to Shorts
Revanth Reddy
Fish Curry
Murrel
Kiran Mudiraj
Warangal District

More Telugu News