Jagan: పులివెందులలో వైసీపీ నేత కుమారుడి పెళ్లి రిసెప్షన్ కు హాజరైన సీఎం జగన్... వీడియో ఇదిగో!

CM Jagan attends a wedding reception in Pulivendula
  • నేడు కడప జిల్లాలో పర్యటించిన సీఎం జగన్
  • పులివెందులలో వైసీపీ నేత మూలి బలరామిరెడ్డి కుమారుడి పెళ్లి రిసెప్షన్
  • వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ ఇవాళ కడప జిల్లాలో పర్యటించారు. సున్నపురాళ్లపల్లె వద్ద జేఎస్ డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ కు భూమి పూజ చేసిన ఆయన అనంతరం, పులివెందులలో ఓ శుభకార్యానికి హాజరయ్యారు. వైసీపీ నేత మూలి బలరామిరెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ నేడు పులివెందుల ఎన్సీఎస్సార్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సీఎం జగన్ వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి, ఆశీస్సులు అందించారు.

వివాహ వేదికపై సీఎం ఉత్సాహంతో కనిపించారు. వైసీపీ నేత కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. అనంతరం, నియోజకవర్గ ప్రజలను కూడా పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

More Telugu News

Jagan
Weeding Reception
Pulivendula
YSRCP
Kadapa District