పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ ప్రెస్
- విశాఖ నుంచి హైదరాబాద్ వెళుతున్న గోదావరి ఎక్స్ ప్రెస్
- ఘట్ కేసర్ వద్ద ప్రమాదం.. పట్టాలు తప్పిన 4 బోగీలు
- తీవ్ర భయాందోళనలకు గురైన ప్రయాణికులు
- ప్రయాణికులు సురక్షితమన్న రైల్వే అధికారులు
ప్రమాదం కారణంగా పట్టాలు తప్పిన బోగీలను అక్కడే వదిలేసి... మిగతా బోగీలతో రైలు సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంది. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
కాగా, పట్టాలు తప్పిన సమయంలో రైలు చాలా తక్కువ వేగంతో వెళుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు హెల్ప్ లైన్ నెం. 040-27786666 ప్రకటించారు.