'కృష్ణగాడు అంటే ఒక రేంజ్' చిత్రం నుంచి లవ్ సాంగ్ రిలీజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'కృష్ణగాడు అంటే ఒక రేంజ్' చిత్రం నుంచి లవ్ సాంగ్ రిలీజ్

Love anthem released from Krishna gadu ante oka range
  • రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ జంటగా చిత్రం
  • రాజేష్ దొండపాటి దర్శకత్వం
  • ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో వస్తున్న కొత్త సినిమా
రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం కృష్ణగాడు అంటే ఒక రేంజ్. పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో రాజేష్ దొండపాటి డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. 

సినీ ప్రపంచంలో ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు ఉండే డిమాండే వేరు. యూత్ ఆడియన్స్ మెచ్చే కథాకథనం ఉందంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడానికి తొలి మెట్టు అక్కడే పడినట్టుగా భావిస్తారు. ఇక ఆ సినిమాను తెరకెక్కించే విధానం, నిర్మాణ విలువలతో మేకర్స్‌కి పక్కా హిట్ అనే ధైర్యం వచ్చేస్తుంది. 

సరిగ్గా అదే ఫార్ములాతో వస్తున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీ 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్'. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై కొత్త హీరో, కొత్త హీరోయిన్ ను పరిచయం చేస్తూ ఈ సినిమాను గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా లవ్ ఆంథెమ్ ఆఫ్ 2023 పేరుతో ఓ యూత్ ఫుల్ లవ్ సాంగ్ రిలీజ్ చేశారు. 

"చూడు చూడు చూడమంటూ గుండె..." అంటూ సాగిపోతున్న ఈ పాటలో వరికుప్పల యాదగిరి రాసిన లిరిక్స్ మనసుకు హత్తుకుంటాయి. యశస్వి కొండేపూడి, సాహితి చాగంటి ఆలపించిన తీరు పాటకు ప్రాణం పోసింది. లిరిక్స్ కి తగ్గ విజువల్స్ జోడించి ఈ సాంగ్ రూపొందించిన విధానం యూత్ ఆడియన్స్ మెప్పు పొందేలా ఉంది. 

నిజమైన ప్రేమికుల ఫీలింగ్స్ చెబుతూ పల్లెటూరి వాతావరణంలో షూట్ చేసిన ప్రతి సీన్ కూడా పాటలో హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. సాబు వర్గీస్ బాణీలు ఈ సాంగ్ లో మేజర్ అట్రాక్షన్ అయ్యాయి. దీంతో విడుదల చేసిన కాసేపట్లోనే ఈ సాంగ్ వైరల్ గా మారింది. 

ఇప్పటికే ఈ 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్' మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఇప్పుడు చూడు చూడు లిరికల్ సాంగ్ ఆడియన్స్ దృష్టిని సినిమా వైపు మళ్లించింది. 

ఈ చిత్రంలో రఘు, స్వాతి పొలిచర్ల, సుజాత, వినయ్ మహదేవ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఎడిటర్‌గా సాయి బాబు తలారి పని చేస్తున్నారు. ఎస్ కే రఫి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సాబు వర్గీస్ సంగీతం అందిస్తున్నారు. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.      
Advertisement
Krishna gadu ante oka range
Song
Love Anthem
Movie
Tollywood

More Telugu News