బ్యాంకు లాకర్‌లో దాచుకున్న డబ్బుకు చెదలు.. గొల్లుమన్న మహిళ
- పంజాబ్ నేషనల్ బ్యాంకులో అనూహ్య ఘటన
- చెదలు పట్టి కరెన్సీ నోట్లు పాడవడంతో కస్టమర్‌కు షాక్
- బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంపై వినియోగదారుల ఆగ్రహం
ఈ క్రమంలో బ్యాంకుకు వెళ్లిన ఆమె సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం తన డబ్బు వాపస్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బ్యాంకు మేనేజరుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో..బాధితురాలు నష్టపోయిన మొత్తాన్ని బ్యాంకు అప్పటికప్పుడు తిరిగిచ్చేసింది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. బ్యాంకు అధికారులు కూడా ఈ పరిణామంతో షాకైపోయారట. లాకర్‌లో దాచిన కరెన్సీ నోట్లలో చాలామటుకు చెదలుపట్టి నిరుపయోగంగా మారినట్టు గుర్తించి నివ్వెరపోయారు. స్థానికంగా ఈ వార్త కలకలం రేపడంతో కస్టమర్లు బ్యాంకుకు పోటెత్తారు. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెదల నివారణ కోసం బ్యాంకు పటిష్ఠ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.