Ravichandran Ashwin: స్టేడియం వద్ద ఎవరోగానీ నన్ను "అన్నా భయ్యా" అని పిలిచారు: అశ్విన్

Ashiwn tweets interesting matter during Nagpur test
షార్ట్స్‌లో చూడండి
నాగపూర్ టెస్టులో భారత జట్టు ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించడం తెలిసిందే. ఆసీస్ ను స్పిన్ ఉచ్చులో బిగించిన టీమిండియా రెండున్నర రోజుల్లోనే మ్యాచ్ ముగించింది. కాగా, మ్యాచ్ సందర్భంగా జరిగిన సంఘటనను టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. 

"స్టేడియం వద్ద ఎవరో గానీ ఇవాళ నన్ను 'అన్నా భయ్యా' అని పిలిచారు. అన్న, లేక భయ్యా అనే పదాలకు అర్థం ఒక్కటే. మనకంటే పెద్దవాళ్లను "అన్నా" అని పిలుస్తాం. ఇవాళ ఆ అభిమాని ఎలా పిలిచినా గానీ, అతడి ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే అన్న, భయ్యా అనే పదాలకు అర్థం ఏంటో చెప్పడం వల్ల ఆ అభిమానికి ఉపయోగం ఉంటుందని భావిస్తున్నా" అంటూ అశ్విన్ ట్వీట్ చేశాడు.
Go Back to Shorts
Ravichandran Ashwin
Anna Seva
Bhayya
Nagpur Test
Team India
Australia

More Telugu News