అమెరికా ప్రథమ మహిళ ముద్దు వీడియో వైరల్..!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికా ప్రథమ మహిళ ముద్దు వీడియో వైరల్..!

Video of US First lady jill biden kissing kamala harris husband on lips goes viral in social media
  • ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ భర్త పెదాలను ముద్దాడిన అమెరికా అధ్యక్షుడి భార్య 
  • ఉభయ చట్టసభలను ఉద్దేశించి అధ్యక్షుడి ప్రసంగానికి ముందు జరిగిన ఘటన
  • నెట్టింట్లో వీడియో వైరల్.. షాక్‌లో నెటిజన్లు..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ ముద్దు వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వీడియో‌లో జిల్ బైడెన్.. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ భర్త డగ్ ఎమ్‌హాఫ్‌ను ముద్దాడారు. అమెరికాలో స్నేహితులు, పరిచయస్తుల మధ్య మర్యాదపూర్వక చుంబనాలు, కౌగిలింతలు సాధారణమే కానీ.. జిల్ నేరుగా కమల భర్త పెదాలను కిస్ చేయడంతో అగ్రరాజ్యంలో ఈ ఉదంతం చర్చనీయాంశమైంది. తనవైపుగా వస్తున్న జిల్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు డగ్ చేయిచాచారు. ఈ క్రమంలోనే జిల్ ఆయనను పెదాలపై కిస్ చేశారు. మంగళవారం అమెరికా ఉభయ చట్టసభలను ఉద్దేశించి అధ్యక్షుడు బైడెన్ ప్రసంగానికి కొన్ని క్షణాల ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. 

ఎనిమిది సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియోను బెన్నీ జాన్సన్ అనే జర్నలిస్టు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘‘ఏంటీ.. జిల్ బైడెన్ కమల భర్త పెదాలపై ముద్దు పెట్టారా’’ అంటూ కామెంట్ కూడా జత చేశారు. నెట్టింట్లో కాలుపెడుతూనే ఈ వీడియో వైరల్ అయిపోయింది. ఇప్పటివరకూ దీనికి ఏడు లక్షల వ్యూస్ వచ్చిపడ్డాయి. నెటిజన్లు కామెంట్ సెక్షన్లో ఎమోజీలు, రకరకాల వ్యాఖ్యల వరద పారిస్తున్నారు. అసలేం జరిగిందో అర్థం కాలేదంటూ చాలా మంది ఎమోజీలు పెట్టారు. తమకు నోట మాటరావట్లేదంటూ మరికొందరు కామెంట్ చేశారు. కాగా.. ఆ సమావేశంలో జిల్ కిస్‌ను చూసిన వారెవరూ పెద్దగా స్పందించనట్టు వీడియోలో కనిపించింది. యథాప్రకారం వారందరూ చప్పట్లు కొడుతూ జిల్‌కు ఆహ్వానం పలికారు.
Advertisement
USA
Jill biden
Kamala Harris

More Telugu News