కళాతపస్వి కె.విశ్వనాథ్ నివాసానికి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు
- గురువారం రాత్రి కన్నుమూసిన కె.విశ్వనాథ్
- నేడు కె.విశ్వనాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన చంద్రబాబు
- కళాతపస్వి చిత్రపటానికి నివాళులు
92 ఏళ్ల కె.విశ్వనాథ్ గత కొంతకాలంగా వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికే ఆయన మరణించినట్టు వైద్యులు తెలిపారు.

