ఈ వీడియో చూశాక చెప్పండి.. వీరిలో జంతువు ఎవరో, మనుషులు ఎవరో?: ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్
- కుక్కపిల్ల కాళ్లను చెరోవైపు పట్టుకుని గాల్లో గింగిరాలు తిప్పిన యువకుడు, అమ్మాయి
- గాల్లో ఎగరేస్తూ వికృతానందం
- విరుచుకుపడుతున్న నెటిజన్లు
- వారిద్దరితోపాటు దానిని షూట్ చేసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్
ఆ పక్కనే గోడపై ఉన్న కోతులకు కుక్క పిల్లను చూపిస్తూ వాటిని భయపెట్టే ప్రయత్నం చేశారు. ఈ వీడియో చూశాక వీరిలో మనిషి ఎవరు? జంతువు ఎవరో? చెప్పాలని శరణ్ ఆవేదనగా ప్రశ్నించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. కుక్క పిల్లను హింసించిన యువకుడు, అమ్మాయితోపాటు ఈ ఘటనను చిత్రీకరించిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ ఇద్దరితోపాటు దానిని షూట్ చేసిన వ్యక్తి... మొత్తం ముగ్గురూ జంతువులేనని, తన ఎదురుగా కనుక ఇలా చేసి ఉంటే వారి మూతి పగలగొట్టి ఉండే వాడినని ఓ యూజర్ కామెంట్ చేశాడు.